ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం..! 1 d ago
AP: విశాఖలో బుధవారం ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. లక్ష మంది కూర్చునేలా ప్రధాన వేదిక వద్ద అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు రెండు లక్షల మంది ప్రజలు సభకు హాజరవుతారని సమాచారం. రేపు ప్రధాని మోదీ చేతులు మీదగా విశాఖలో వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారు.